Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రేమికుల దినోత్సవం రోజే గోవా బీచ్లో విషాదం అలముకుంది. వాలంటైన్స్ డేను జరుపుకునేందుకు గోవా వచ్చిన దంపతులు మంగళవారం రాత్రి సముద్రంలో మునిగి మరణించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులైన సుప్రియాదూబే(26), విభూశర్మ(27)లిద్దరూ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు గోవా వచ్చారు. గోవాలోని పాలోలెం బీచ్లో జలకాలాడుతూ ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగి మరణించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో వారిద్దరి మృతదేహాలను కొంకణ్ సోషల్ హెల్త్ సెంటరుకు తరలించి పోస్టు మార్టం చేయించారు. సుప్రియా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, ఆమె భర్త విభూ ఢిల్లీలో ఉండేవారు.దంపతులిద్దరూ గత కొన్ని రోజులుగా గోవాలో పర్యటిస్తున్నారని, వీరి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గోవా పోలీసులు చెప్పారు.