Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులో ఓ పెళ్లింట మద్యం చిచ్చు రేపింది. కాంచీపురానికి చెందిన లక్ష్మీనరసింహన్ కు, చెంగల్పట్టు జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. సోమవారం పెళ్లి జరగాల్సి ఉండగా, ఆదివారం రాత్రి వధూవరుల కుటుంబాలు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నాయి. ఓ కల్యాణమండపంలో జరిగిన ఈ విందులో పెళ్లికొడుకు రెచ్చిపోయాడు. ఫుల్లుగా మందుకొట్టి ఊగిపోయాడు. మద్యం మత్తులో అతడి అసభ్య ప్రవర్తన పెళ్లికూతురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి వాడితో తన జీవితం కష్టాలపాలవుతుందని భయపడి ఆమె తనకీ పెళ్లి వద్దంటూ వేదిక దిగి వెళ్లిపోయింది. వధువు వెళ్లిపోవడంతో ఆ విందు మధ్యలోనే ఆగిపోయింది. అంతేకాదు వరుడి నిర్వాకంతో ఆగ్రహించిన పెళ్లికూతురు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కల్యాణ మండపానికి వెళ్లి చూడగా, వరుడు తప్పతాగిని స్థితిలో కనిపించాడు. ఈ నేపథ్యంలో, పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు స్పష్టం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు... తాము వరుడికి కానుకగా ఇచ్చిన బంగారు గొలుసు, బంగారు ఉంగరం, బంగారు వాచీ వెనక్కి తీసేసుకున్నారు.