Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల్లో ఇవాళ కూడా ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రంతా సోదాలు చేసిన అధికారులు.. వరుసగా రెండో రోజూ కూడా తనిఖీలు చేపడుతున్నారు. మరో వైపు బీబీసీ సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ చేసింది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఐటీశాఖ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఉద్యోగులకు సూచన చేసింది. వ్యక్తిగత ఆదాయం అంశాలపై ఉద్యోగులు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా బీబీసీ తన మెయిల్లో స్పష్టం చేసింది. ఐటీ అధికారులు సమగ్రమైన రీతిలో సమాధానం ఇవ్వాలని బీబీసీ తన ఉద్యోగులకు తెలిపింది. రెండో రోజు సోదాల్లో కేవలం ట్యాక్స్ డిపార్టమెంట్ను మాత్రమే ఐటీ అధికారులు టార్గెట్ చేయనున్నారు.