Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగుళూరు
ఏరో ఇండియా షోలో ఇప్పటికే ఎఫ్-35 స్టీల్త్ విమానాలు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రెండు ఎఫ్-35 వేరియంట్లను ఈ షోలో ప్రదర్శించారు. ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్, సూపర్ హార్నెట్ ఫైటర్ విమానాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.
ఈ తరుణంలో అమెరికాకు చెందిన రెండు బీ-1బీ లాన్సర్ బాంబర్ విమానాలు ఏరో ఇండియా షో ప్రదర్శనకు వచ్చాయి. గువామ్‌లోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఉన్న ఆ విమానాలు ప్రస్తుతం యెలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దర్శనమిస్తున్నాయి. సూపర్సోనిక్ హెవీ బాంబర్ విమానాలను బోన్‌గా కూడా పిలుస్తారు. ఈ బాంబర్ విమానాలు భారీ పేలోడ్‌ను కూడా మోసుకెళ్లగలవు.