Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగిత్యాల
జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి మరో రూ.500కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఈ తరుణంలో ఇప్పటికే ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు ప్రకటించిని విషయం తెలిసిందే. ఇదే క్రమంలో మరో రూ.500కుకోట్లు (మొత్తం రూ.600కోట్లు) కూడా కేటాయించనున్నట్లు తెలిపారు. దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి అంజన్న క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన అభివృద్ధి చర్యలపై దిశానిర్దేశం చేశారు.