Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లామాబాద్
పాకిస్థాన్లోని తమ దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక వెబ్సైట్లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 13 నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాకిస్థాన్లోగల తమ రాయబార కార్యాలయంలోని దౌత్య విభాగం తాత్కాలికంగా మూసి ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపింది. అయితే పాకిస్థాన్లోని తమ దౌత్య విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయడం వెనుక ఇతర కారణాలేమీ లేవని, కేవలం సాంకేతికపరమైన సమస్యల వల్లే అలా జరిగిందని చైనా తెలిపింది.