Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లక్నో
ఇటీవల కాన్పూర్ దెహత్ జిల్లాలోని ఓ గ్రామంలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇండ్లను కూల్చివేస్తుండగా ప్రజలు అడ్డం తిరిగారు. ఆ తరుణంలో పోలీసులు కాల్పులు జరపడటంతో ఓ 45 ఏండ్ల మహిళ, ఆమె 20 ఏండ్ల కూతురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ తరుణంలో బహుజన్ సమాజ్వాది పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీకూతుళ్లు మరణించిన ఘటన రాష్ట్రంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కంటే తల్లీకూతుళ్ల మరణవార్తే ఎక్కువగా వార్తల్లో నిలిచిందన్నారు. బీజేపీ బుల్డోజర్ రాజకీయాలు అమాయకులైన పేద ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని, ఇది చాలా విషాదకరమని మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. యోగీ సర్కారు వెంటనే తన ప్రజావ్యతిరేక విధానాలను మార్చుకోవాలని మాయావతి ట్వీట్ చేశారు.