Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 సెషన్-2కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. దరఖాస్తులు చేసుకొనేందుకు ఎన్టీఏ www.jeemain.nta.nic.in వెబ్సైట్లో ప్రత్యేక విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 7 నుంచే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ తరుణంలో బుధవారం దరఖాస్తులను ఆహ్వానిస్తూ వెబ్సైట్లో లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త అభ్యర్థులతో పాటు మొదటి సెషన్ పరీక్ష రాసిన విద్యార్థులు కూడా రెండో విడత పరీక్షకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో జరగనుండగా ఏప్రిల్ 13, 15 తేదీలను ఎన్టీఏ రిజర్వు చేసింది. దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి నుంచి మొదలై మార్చి 12 రాత్రి 9గంటల వరకు కొనసాగనుంది. పరీక్ష రుసుం చెల్లించేందుకు మార్చి 12న రాత్రి 11.50గంటల వరకు అవకాశం ఉంటుందని ఎన్టీఏ ఓ ప్రకటనలో తెలిపింది.