Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నిజామాబాద్
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదవాశాత్తు విత్యుత్ఘాతానికి గురై ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో బుధవారం స్థానికులు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు జరుపుకునేందుకు నిర్ణయించారు.
జెండా ఏర్పాట్ల కోసం కర్రను పైకి ఎత్తడంతో కరెంట్ తీగలకు తగిలి విద్యుత్ షాక్కు గురై మూడ్ గణేశ్ అలియాస్ సుభాశ్ నాయక్, శంకర్ నాయక్, హరీశ్ నాయక్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బోధన్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సుభాశ్నాయక్ మృతి చెందాడు. మరో ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో రుద్రూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.