Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - యూరప్
లుఫ్తాన్సా విమాన సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య వల్ల వందలాది విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాలను దారి మళ్లించారు. జర్మన్ ఎయిర్‌లైన్ దిగ్గజం లుఫ్తాన్సా ఈ మేరకు బుధవారం ప్రకటించింది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిర్మాణ పనుల వల్ల కేబుల్ తెగినట్లు తెలిపింది. ఈ తరునణంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల తమ గ్రూప్ సంస్థలకు చెందిన పలు విమానాలు రద్దు అయినట్లు తెలిపింది. మరికొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు వెల్లడించింది. ది
అయితే యూరప్‌లోనే అతి పెద్ద ఎయిర్‌లైన్ గ్రూప్ లుఫ్తాన్సా. యూరోవింగ్స్, స్విస్, బ్రస్సెల్స్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ కూడా ఈ గ్రూప్‌కు చెందినవే. లుఫ్తాన్సా ప్రధాన కార్యాలయంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ఈ ఎయిర్లైన్పైనా వాటి ప్రభావం పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు తెలుస్తున్నది.