Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అగర్తలా
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 60 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుండగా ఏర్పాట్లన్నీ పూర్తిచేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కిరణ్‌కుమార్ దినకర్రో తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ రేపు ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా 28.13లక్షల మంది ఓటర్లు ఉండగా 3,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
అయితే ఈ త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఐపీఎఫ్టీతో కలిసి పోటీ చేస్తుండగా సీపీఎం-కాంగ్రెస్‌తో జట్టుకట్టి బరిలో నిలిచింది. ఇకపోతే, తిప్రా మోతా పార్టీ సొంతంగానే ఎన్నికల రంగంలోకి దూకింది. ఈ ఎన్నికల కోసం 31వేల మంది పోలింగ్ సిబ్బంది, 25వేల మంది కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు.
దీనిలో 60 సీట్లకు గాను బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఆ పార్టీ మిత్రపక్షం ఐపీటీఎఫ్ మిగతా చోట్ల బరిలో ఉంది. ఇదిలా ఉండగా, సీపీఎం 47 చోట్ల పోటీ చేస్తుండగా మిత్రపక్షం కాంగ్రెస్ 13చోట్ల బరిలో ఉంది. తిప్రా మోతా పార్టీ 42చోట్ల పోటీ చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 28 మందిని పోటీలో నిలపగా 58మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ అత్యధికంగా 12మంది మహిళల్ని బరిలో నిలిపడం విశేషం.