Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రంగారెడ్డి
మహేశ్వరం మండలం ఉప్పుగడ్డ తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ క్రమంలో రెండు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న సేవాలాల్ మహారాజ్ మందిరానికి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ తరుణంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.
అంతే కాకుండా రాష్ట్రంలో మూడు వేల జనాభా ఉన్న గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వారిని ప్రజాప్రతినిధులుగా ఎదిగేందుకు అవకాశం కల్పించారని, ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గిరిజనుల అభివృద్ధికి నిరంతరం తపించిన సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి అన్ని విధాలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గిరిజనులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు కార్తీక్‌రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, సేవాలాల్ అధ్యక్షుడు సీతారం నాయక్ తదితరులు పాల్గొన్నారు.