Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రపంచ క్రికెట్లో 6 గంటలపాటు టీమిండియా అగ్రస్థానం ప్రస్థానం కొనసాగింది. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పొరపాటు కారణంగా భారత్ మూడు ఫార్మట్లలో నంబర్ వన్‌గా నిలిచింది. తప్పిదాన్ని సరిద్దిద్దిన ఐసీసీ తిరిగి ఆస్ట్రేలియాను అగ్రస్థానంలోకి తీసుకొచ్చి తమ అధికారిక వెబ్సైట్లో తెలిపింది.
బుధవారం ఐసీసీ తన వెబ్సైట్లో టెస్టుల్లో భారత్‌ను అత్యుత్తమ జట్టుగా చూపించింది. దాంతో అన్ని ఫార్మట్లలో టీమిండియా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నది. అయితే, జరిగిన పొరపాటును గ్రహించిన ఐసీసీ 6 గంటల తర్వాత మళ్లీ కొత్త ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. దీనిలో టీమిండియా మళ్లీ రెండవ స్థానంలోని వచ్చింది. ఈ పొరపాటు ఎలా జరిగింది..? ఎందుకు జరిగింది..? ఎవరు చేశారు..? అనే విషయాలపై ఐసీసీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఐసీసీ తన అధికారిక వెబ్సైట్లో మధ్యాహ్నం 1:30 గంటలకు టీమిండియాను నంబర్ 1 టెస్ట్ జట్టుగా ప్రకటించారు. రెండున్నర గంటల తర్వాత భారత్‌ను నంబర్1 నుంచి నంబర్ 2 కి మార్చారు. ఆస్ట్రేలియా మళ్లీ నంబర్ 1 టెస్టు జట్టుగా అవతరించింది. అయితే, ర్యాంకింగ్స్‌లో జరిగిన ప్రధాన లోపంపై ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.