Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కింద నిర్వహించే అగ్నివీరుల నియామక పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే జోన్ల వారీగా నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుదల చేశారు.
రెండు దశల్లో చేపట్టే ఈ ఎంపిక ప్రక్రియలో తొలుత ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ర్యాలీ చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్ 17నుంచి అగ్నివీర్ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అగ్నివీరులుగా ఎంపిక చేయనున్నారు. అగ్నివీరులుగా చేరేందుకు https://www.joinindianarmy.nic.in/index.htm లో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు joinindianarmy.nic.in వెబ్సైట్ను సందర్శించాలి.