Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఢీల్లి
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ టి20 క్రికెట్లో చరిత్ర సృష్టించింది. టీమిండియా తరపున టి20ల్లో వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆరీ ఫ్లెచర్‌ను ఔట్ చేయడం ద్వారా దీప్తి శర్మ ఈ ఘనత సాధించింది. ఓవరాల్‌గా దీప్తి శర్మ 89 టి20 మ్యాచ్‌ల్లో వంద వికెట్ల మార్క్‌ను అందుకుంది. అయితే ఈ ఘనత సాధించిన తొలి టీమిండియా మహిళా క్రికెటర్‌గానూ చరిత్రకెక్కడం విశేషం.
ఈ తరుణంలో టీమిండియా మహిళా వెటరన్ లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 72 మ్యాచ్‌ల్లో 98 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. టి20 క్రికెట్లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న మహిళా క్రికెటర్ల జాబితాలో దీప్తి శర్మ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక మహిళల టి20 క్రికెట్లో సీనియర్ వెస్టిండీస్ స్పిన్నర్ అనీసా మహ్మద్ 125 వికెట్లు(117 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్ నిదాదార్(121 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్ పెర్రీ (120 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.