Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రేపు సిద్ధిపేట జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పర్యటించనున్నారు. గజ్వేల్, సిద్ధిపేట నియోజకవర్గాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు పర్యటించి, గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. ఈ క్రమంలోనే కొండపోచమ్మసాగర్‌ను వీక్షించనున్నారు. అలాగే ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాలను సందర్శించనున్నారు. ఆ తర్వాత కూడవెల్లి వాగుపై చెక్‌డ్యామ్‌ను పరిశీలించనున్నారు.