Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ కొరియాలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అగ్గిపెట్టెతో ఆడుకుంటూ వెళ్లి.. పక్కనే ఉన్న గడ్డికి నిప్పంటించాడు. దీంతో మంటల్లో చిక్కుకున్న ఆ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన మంగళవారం అర్ధరాత్రి కొరియా ప్రాంతంలో జరిగింది. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ బాలుడు ఆడుకుంటూ.. పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇంట్లో పశువుల మేత కోసం గడ్డిని నిల్వ ఉంచారు. అయితే అగ్గిపెట్టెతో ఆడుకుంటున్న బాలుడు.. గడ్డికి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో మంటలు చేలరేగాయి. చిన్నారి ఏడుపు విన్న తల్లి పరుగెత్తుకుంటూ వెళ్లి కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.