Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద పదవీవిరమణ చేసినట్లు సమాచారం. అయితే సోమేశ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశించడంతో ఆయనను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది.
ఆయన పెట్టుకున్న దరఖాస్తును సీఎం జగన్ ఆమోదించినట్టు సమాచారం. ఆయన జనవరి 12న అమరావతికి వచ్చి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసి నెల రోజులు దాటుతున్నా ఇప్పటివరకూ పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద పదవీవిరమణకు దరఖాస్తు చేసుకోవడం విశేషంగా మారినట్లు తెలుస్తుంది.