Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
దేశ రాజధాని ఢీల్లీలో యువతిని హత్య చేసి ఫ్రీజర్‌లో దాచిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సాహిల్ గహ్లోత్ బాధిత యువతి నిక్కీ యాదవ్‌ను ఛార్జింగ్ వైర్ తో కారులోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. అనంతరం ఆమె శవాన్ని కారులోని తన పక్క సీటులో ఉంచి సుమారు 40 కి.మీ మేర ప్రయాణం చేశాడని పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత శవాన్ని దక్షిణ ఢీల్లీలో ఉన్న తన దాభాలోని ఫ్రీజర్‌లో సాహిల్ దాచిపెట్టాడు. మంగళవారం ఆమె శవాన్ని గుర్తించిన పోలీసులు సాహిల్‌ను ఆరెస్టు చేశారు. ఢీల్లీ కోర్టు అతణ్ని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమంతించింది. పోస్ట్‌మార్టమ్ నివేదికలో కూడా నిక్కీ ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. హత్య జరిగిన రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నిక్కీ యాదవ్ అపార్ట్మెంట్ పైఅంతస్తులోకి వెళుతున్న దృశ్యాలతోపాటు, అదే రోజు రాత్రి 9 గంటలకు బయటి నుంచి ఫ్లాట్‌లోకి వస్తున్నట్లుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. నిక్కీ ఈ ఫ్లాట్‌లో తన బంధువుతో కలిసి ఐదు నెలలుగా ఉంటున్నట్లు చుట్టుపక్కలవారు చెబుతున్నారు.
అనంతరం ఆమె శవాన్నిసాహిల్కు చెందిన దాభాలోని ఫ్రీజర్‌లో దాచి, ఏమీ తెలియనట్లు నజఫగర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. తర్వాత ఫిబ్రవరి 10న తనకు నిశ్చితార్థం జరిగిన యువతిని వివాహం చేసుకున్నాడు. మరోవైపు నాలుగురోజులుగా నిక్కీని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫిబ్రవరి 14న నిక్కీ శవాన్ని ధాబాలో గుర్తించారు. అనంతరం నిక్కీ, సాహిల్ ప్రేమలో ఉన్నట్లు విచారణలో తేలడంతో అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరపడంతో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి.