Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీనగర్
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో దేశంలోకి అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు అంతమొందించాయి. కుప్వారాలోని సైద్పొరాలో వాస్తవాదీన రేఖ వెంబడి ఉగ్రవాదులు అక్రమ చొరబాటుకు యత్నిస్తున్నారనే నిర్ధిష్టమైన సమాచారం ఆర్మీకి అందింది.
ఈ తరుణంలో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. ఈ విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.