Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాకిస్థాన్
క్వెట్టా వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పెషావర్ నుంచి క్వెట్టాకు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు. చిచావత్ని రైల్వే స్టేషన్ వద్దకు రాగానే నాలుగో నంబర్ బోగీలో సిలిండ్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సిలిండర్‌ను ఓ ప్రయాణికుడు రైలు వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లినట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. రైలు, ట్రాక్ మొత్తాన్ని పరిశీలించి పేలుడు జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు. కేసు నమోదు చేసుకుని, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.