Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేను కలిసిన అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ తరుణంలో మర్యాదపూర్వకంగానే ఠాక్రేను కలిసినట్లు తెలిపారు. రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కలిశానని తమ మధ్య అనేక రాజకీయాంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. బీజేసీ, బీఆర్ ఎస్ ను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు.
ఠాక్రే అనుభవం తెలంగాణ కాంగ్రెస్‌కు ఉపయోగపడుంది. రాష్ట్రంలోని 70 స్థానాల్లో విజయం కోసం పనిచేస్తాం. కాంగ్రెస్ బలం, బలహీనతను ఠాక్రేకు వివరించాం. చాలా మంది సీనియర్లు పాదయాత్ర షెడ్యూల్‌ఇచ్చారు. నా పాదయాత్ర రూట్ మ్యాప్‌ను త్వరలో తెలియజేస్తానన్నారు. ఈ క్రమంలోనే ఎంపీ కోమటిరెడ్డి మాటలను వక్రీకరించారు. ఆయన చెప్పింది ఒకటైతే. మీడియాలో వచ్చింది మరొకటి ప్రజలకు అది మరోలా అర్థమైంది. పార్టీకి నష్టం జరిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదు అని జగ్గారెడ్డి అన్నారు.