Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని మంత్రి కేటీఆర్ని ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత కోరారు. మంత్రి కేటీఆర్ని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే జరిగిన పార్లమెంట్ సమావేశాల గురించి చర్చించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, సింగరేణి కార్మికుల ఆదాయ
పన్ను మినహాయింపులు, సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే ప్రాజెక్టులు, మౌలిక
సదుపాయాలు, పెద్దపల్లి-మంచిర్యాల జిల్లాల్లో నవోదయ విద్యాలయాల మంజూరు, నేషనల్ హైవే
ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా తదితర అంశాలపై పార్లమెంటులో చర్చించిన తీరును మంత్రి కేటీఆర్కు వివరించారు. ఇదే సందర్భంలో రానున్న రోజుల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.