Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ దుబ్బాక రూరల్
కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నదని దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ చింతల జ్యోతి, ఎంపీటీసీ రామ్ రెడ్డి ,సర్పంచ్ తౌడ శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలోని రైతు వేదికలో గురువారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉప సర్పంచ్ సుజాత మల్లేశం,ఎంపీడీఓ భాస్కర్ శర్మ ,ఎంపీవో నరేందర్ రెడ్డి కార్యదర్శి శిరీష్ లతో కలిసి వారు ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజలకు సరైన వైద్యం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులకు, అన్ని వర్గాల వారికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు .18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు రైతు సమన్వయ అధ్యక్షుడు కొంగరి ముక్తారెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఎండి ఇస్మాయిల్ , అంగన్వాడి టీచర్లు ఆశ వర్కర్లు, ఐకెపి పరశురాం , సీఏలు పద్మ ,రేణుక, మంజుల,ఏఎన్ఎమ్ , ఆశ వర్కర్లు డాక్టర్ బృందం ఉన్నారు.