Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలోనే ఒక అద్భుతమైన గొప్ప పర్యాటక కేంద్రంగా మానేరు రివర్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి కరీంనగర్ శివారులోని కేబుల్ బ్రిడ్జిపై 6.50 కోట్లతో చేపట్టనున్న డైనమిక్ లైటింగ్ సిస్టం పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మానేరు రివర్ ఫ్రంట్‌ను కరీంనగర్‌కు మణిహారంలా తీర్చిది ద్దుతామన్నారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని, అప్రోచ్ రోడ్డు పనులు కూడా తుది దశకు చేరాయని చెప్పారు. ఈ ఉగాదిలోగా అందుబాటులోకి తెచ్చే సంకల్పంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జిపై జర్మనీ టెక్నాలజీతో డైనమిక్ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.