Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నాని తరువాత ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన హీరోగా కిరణ్ అబ్బవరం కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వినరో భాగ్యము విష్ణు కథ' రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటుకి అఖిల్ చీఫ్ గెస్టుగా వచ్చాడు. ఈ వేదికపై కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. 'మొదటిసారి అల్లు అరవింద్ గారిని కలుసుకున్నప్పుడు చాలా భయం వేసింది. ఆ తరువాత ఆయనపట్ల గౌరవం పెరిగింది .. ఆ తరువాత చనువు పెరిగింది. గీతా ఆర్ట్స్ లో తీసిన సినిమాలు చూసే నాకు, ఆ బ్యానర్లో చేసే ఛాన్స్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అందుకు కారకులు అల్లు అరవింద్ గారే' అని అన్నాడు. 'మనం' సినిమాలో అఖిల్ ఎంట్రీ చూసి నేను కూడా విజిల్ వేసినవాడినే. అలాంటి అఖిల్ నా సినిమాకి చీఫ్ గెస్టుగా రావడం సంతోషంగా ఉంది. నన్ను ఇక్కడి వరకూ తీసుకొచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.