Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పోలీస్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో రెండోరోజు గురువారం కొనసాగాయి. దేహదారుఢ్య పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరుగకుండా పటిష్టమైన బందోబస్తుతో ప్రత్యేకాధికారి శబరీస్ పర్యవేక్షించారు. రెండోరోజు పరీక్షలకు 1012మంది అభ్యర్థులకు 797మంది అభ్యర్థులు హాజరవగా 327 మంది అర్హత సాధించారు.
అన్ని రకాల దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో బయోమెట్రిక్ విధానంతో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ అధికారులు సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.