Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సిలిండర్ పేలి ఇంటి పై కప్పు ధ్వంసమైన ఘటన పహాడిషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. మంఖాల్కు చెందిన బరిగేలా మధుకర్ 45, బుధవారం ఉదయం 6గంటలకు గ్యాస్ స్టవ్ పై టీ పెట్టి ఇంటి బయట దుస్తులు ఉతుకుతున్నాడు. ఈ సమయంలో పెద్ద శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. మధుకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.