Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ శుక్రవారం రాజీనామా చేశారు. మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్ తర్వాత చేతన్ శర్మ తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జే షాకు పంపారు. వీడియోలో చేతన్ శర్మ పలు సమస్యల గురించి మాట్లాడాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య సంబంధాల గురించి కూడా శర్మ వ్యాఖ్యలు చేశారు.
గత నెలలో చేతన్ శర్మను బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా తిరిగి నియమించారు. అయితే వివాదాస్పద స్టింగ్ ఆపరేషన్ అతన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది.భారత కెప్టెన్ రోహిత్ శర్మతో 30 నిమిషాలు ఎలా మాట్లాడాడో చేతన్ శర్మ చెబుతూ పట్టుబడ్డాడు. సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి మధ్య జరిగిన వివాదం గురించి చేతన్ శర్మ సుదీర్ఘంగా మాట్లాడాడు.ఈ స్టింగ్ ఆపరేషన్ సోషల్ మీడియాలో సంచలనం రేపింది. క్రికెట్ జట్టుకు సంబంధించి రహస్య విషయాలు బయటకు రావడాన్ని బీసీసీఐ సీరియస్ గా తీసుకుందని క్రీడావర్గాల సమాచారం.