Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండియాతో జరుగుతున్నరెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి రోజు భోజన విరామ సమయానికి 94 రన్స్ చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ లబుషేన్, ఆ తర్వాత వచ్చిన స్మిత్ కూడా స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. లబుషేన్ 18 రన్స్ చేయగా.. వార్నర్ 15 రన్స్ చేసి ఔటయ్యాడు. స్టీవ్ స్మిత్ డకౌట్ అయ్యాడు. అశ్విన్ ఒకే ఓవర్లో ఇద్దర్ని ఔట్ చేశాడు. లబుషేన్, స్మిత్ వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. షమీకి ఒక్క వికెట్ దక్కింది. ఇక మరో ఓపెనర్ ఖవాజా ధీటుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. (50) అర్దసెంచరి చేసి క్రీజ్‌లోనే ఉన్నాడు. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్నది. ఆ జట్టులో రెండు మార్పులు చేశారు.