Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చాలా చోట్ల అంగరంగ వైభవంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు చేస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే ఓ అపశృతి చోటు చేసుకుంది. కాచిగూడలోని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కేసిఆర్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయ్యారు. గ్యాస్ బెలున్లు గాలిలో వదిలే సమయంలో కార్యకర్తలు టపాకాయలు కాల్చడం తో నిప్పు రవ్వలు చెలరేగాయి. దీంతో బెలున్లపై అగ్గి రవ్వలు పడి ఒక్క సారిగా పేలిపోయాయి బెలూన్లు. దీంతో బెంబేలెత్తి పరుగెత్తే యత్నం చేశారు కాలేరు వెంకటేష్, కార్యకర్తలు. ఈ తరుణంలోనే కింద పడ్డారు ఎమ్మెల్యే, కార్యకర్తలు. దీంతో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.