Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అతి త్వరలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తారని బీఆర్ఎస్ నాయకుడు రావెల కిషోర్ బాబు తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మెరుపుతీగ రాజకీయాలు చేయబోతోంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు. పొత్తులు ఎవరితో ఉంటాయనేది భవిష్యత్తు లో అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేసుకోవాలని జగన్ కు చంద్రబాబుకు కేసిఆర్ సూచించారని వెల్లడించారు. కేసీఆర్ మాటలు పెడచెవిన పెట్టడం వల్లే ఈ రోజు ఏపీ రాజధాని లేని రాష్ట్రం అయ్యిందని ప్రభుత్వ అసమర్థత వల్ల ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఉపాధి లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఒక చేత్తో సర్టిఫికెట్లు, మరో చేత్తో పొట్ట పట్టుకొని అంద్ర యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న దుస్తితి ఉంది అమరావతి రాజధానిగా ఉంచాలని బీఆర్ఎస్ నిర్ణయం అన్నారు. మంగళగిరి ప్రాంతంలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.