Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా కేసీఆర్ కు విషెస్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ కు దీర్ఘాయుష్షు కలగాలని, మంచి ఆరోగ్యం లభించేలా దేవుడి దీవెనలు అందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
అటు, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.