Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆలౌట్‌కు మరో వికెట్ దూరంలో ఉంది. షమీ బౌలింగ్‌లో లయాన్ (10) బౌల్డ్ అయ్యాడు. దాంతో, ఆ జట్టు 246 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మాధ్యూ కుహ్నెమన్ క్రీజులోకి వచ్చాడు. అయితే.. ఒకవైపు వికెట్లు పడుతున్నా హ్యాండ్స్కాంబ్ (63) ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడు. టెయిలెండర్లతో కలిసి మరిన్ని పరుగులు జోడించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్.. 248/9.
మూడో సెషన్లో రవీంద్ర జేడజా మరోసారి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో ప్యాట్ కమిన్స్, టాడ్ మర్ఫీని పెవిలియన్ పంపాడు. కమిన్స్‌ను (33) జడ్డూ ఎల్బీగా ఔట్ చేశాడు. దాంతో, 227 వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. కమిన్స్, హ్యాండ్స్కాబ్ 59 రన్స్ జోడించారు.