Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరువనంతపురం
ముఖ్యమంత్రి కేసీఆర్కు కేరళ సీఎం పినరయి విజయన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవపట్ల సీఎం కేసీఆర్కు ఉన్న అంకితభావం అభినందనీయం అన్నారు. కేరళతోపాటు ఇతర రాష్ట్రాలతో సంబంధాలను పెంపొందించుకోవడం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అద్భుతమని ఆయన కొనియాడారు. కేసీఆర్ మంచి ఆరోగ్యంతో జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని విజయన్ ఆకాంక్షించారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.