Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: కృష్ణానది యాజమాన్య బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుత ఏడాది కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని ఈ సమావేశంలో కృష్ణా బోర్డును తెలంగాణ ఈఎన్సీ కోరింది. ఈ ఏడాది ఇప్పటికే ఏపీ తన వాటాకు మించి కృష్ణా నీటిని వాడుకుందని ఫిర్యాదు చేసింది. నీటి లెక్కల విషయంలో కఠినంగా ఉండాలని బోర్డును కోరింది.
తమకు అవకాశం ఉన్న 141 టీఎంసీలు వాడుకుంటామని తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు తెలియజేసింది. కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయాలంది. బోర్డుకు కొత్త చైర్మన్ వచ్చినందున పూర్తిస్థాయి సమావేశం పెట్టాలని ఈఎన్సీ మురళీధర్ కోరారు. ఆ సమావేశంలో అన్ని అంశాలపై చర్చిద్దామని సూచించారు. ఈ నేపథ్యంలో మార్చి మొదటి వారంలో మరోమారు త్రిసభ్య కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉన్నది.