Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టెస్టుల్లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ అరుదైన ఘనత సాధించాడు. పింక్ బాల్ టెస్టులో సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్‌గా అతను రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మొదటి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్లండెల్ చెలరేగి ఆడాడు. 138 రన్స్ చేసి ఔటయ్యాడు. అతను శతకం బాదడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 306 రన్స్ చేయగలిగింది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 79-2తో ఉంది. ఓపెనర్లు జాక్ క్రాలే (28), బెన్ డకెట్ (25) తక్కువ రన్స్‌కే ఔటయ్యారు. ఓలీ పోప్ (14), స్టువార్ట్ బ్రాడ్ (6)క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 98 రన్స్ ఆధిక్యంలో ఉంది.