Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ సంస్థ యూట్యూబ్ కొత్త సీఈవోగా ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ బాధ్యతలు చేపట్టనున్నారు. వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ నుంచి మాజీ సీఈవో సుశాన్ వొజిస్కీ తప్పుకోనున్నారు. 49 ఏళ్ల నీల్ మోహన్.. 2015 నుంచి యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. 1996లో యాక్సెంచుర్‌లో ఆయన తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నెట్ గ్రావిటీ స్టార్టప్‌లో చేరారు. ఆ సంస్థను ఆన్లైన్ అడ్వర్టైజింగ్ సంస్థ డబుల్ క్లిక్ దాన్ని సొంతం చేసుకున్నది.
డబుల్‌క్లిక్ సంస్థను 2007లో గూగుల్ కొనుగోలు చేసింది. ఆ సమయంలో అడ్వాన్సింగ్ గూగుల్ అడ్వర్టైజింగ్ ప్రొడక్ట్స్ కోసం నీల్ మోహన్ పనిచేశారు. యాడ్ వర్డ్స్, యాడ్ సెన్స్, డబుల్‌క్లిక్ లాంటి వాటిపై ఆయన పనిచేశారు. గతంలో మైక్రోసాఫ్ట్‌లో చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ స్ట్రాటజీ మేనేజర్‌గా నీల్ చేశారు. అమెరికన్ పర్సనల్ స్టయిలింగ్ సర్వీస్ స్టిచ్ ఫిక్స్‌లో బోర్డు సభ్యుడి చేశారు. బయోటెక్ కంపెనీ23లో కూడా నీల్ తన సేవల్ని అందించారు. ప్రస్తుతం యూట్యూబ్ సీఈవోగా వ్యవహరిస్తున్న సుశాన్ వొజిస్కీ.. తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్టు గురువారం బ్లాగ్‌పోస్టులో వెల్లడించారు. ఇకపై వ్యక్తిగత జీవితంపై దృష్టిసారించనున్నట్టు చెప్పారు. 2014లో ఆమె సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.