Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సినీ నటి గీతా సింగ్ ఇంట విషాదం నెలకొంది. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దత్తత కుమారుడు మృతి చెందాడు. మరో నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కారులో అయినా, బైక్పై అయినా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, కమెడియన్ గీతా సింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, ఓం శాంతి అంటూ ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. 'ఎవడిగోల వాడిది', 'కితకితలు' వంటి సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీతా సింగ్ వివాహం చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను ఆమె దత్తత తీసుకున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా వీరిలో ఆమె పెద్ద కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన నెటిజన్లు, అభిమానులు గీతాసింగ్కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.