Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని అన్నారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ఆ పరమేశ్వరుడి కృపతో దేశ ప్రజలు, రైతులు సుభిక్షంగా.. సుఖశాంతులతో.. ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆరోగ్యం పాడుచేసుకోకూడదని సూచించారు.