Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో శనివారం చోటు చేసుకుంది. శనివారం ఉదయం కూకట్ పల్లిలో ఇసుక లోడ్ దించుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ మీద పడి గోవింద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.