Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ అభిమానులకు 'ప్రాజెక్ట్-కె' (వర్కింగ్ టైటిల్) చిత్ర బృందం సర్ప్రైజ్ ఇచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ఇది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. భారీ చేయి కింద పడి ఉండగా, ముగ్గురు వ్యక్తులు గన్స్‌తో చేయి వైపు గురి పెడుతూ నిలబడ్డారు. హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్‌ను తలపించేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. మరోవైపు 'ప్రాజెక్ట్ కె' సినిమాను కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. ఆ దిశగా చిత్రబృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై వారి నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఎవరూ స్పృశించని కథతో.. అత్యాధునిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.