Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కోరింది. తాజాగా కంపెనీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రం హోంకు అనుమతించిన అమెజాన్ సంస్థ.. ఈ ఏడాది మే నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్ అంటూ ప్రకటించింది. కరోనా వల్ల విధించిన లాక్డౌన్ను సడలించినప్పటికీ.. అమెజాన్ ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. తమ ఉద్యోగులు ప్రధాన నగరాల్లోని కార్యాలయాలకు వస్తే మా వ్యాపారానికి ప్రోత్సాహం లభిస్తుందని అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జెస్సీ అమెజాన్ బ్లాగ్లో పోస్ట్ చేసిన సందేశంలో పేర్కొన్నారు. అయితే వర్క్ ఫ్రం ఆఫీసు నియమానికి మినహాయింపులు ఇస్తూ.. కస్టమర్ సపోర్ట్ రోల్స్, సేల్స్పీపుల్ రిమోట్గా పని చేసే అవకాశం కల్పించారు.