Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమడోలు మండలం పూళ్ల వద్ద అతివేగంగా వచ్చిన ఏపీ ఆర్టీసీ బస్ ఆగి ఉన్న రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ తరుణంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.