Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
తాలిబన్ల చేతికి ఏదో ఒకరోజు పాకిస్థాన్ వెళుతుందని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ పాక్‌నుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కరాచీలో జరిగిన మానవ బాంబు దాడిని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటనలో తొమ్మిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా తెహ్రీక్-ఇ- తాలిబన్‌కి చెందిన ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనపై నస్రీన్ స్పందిస్తూ పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా మార్చేందుకు ఐఎస్ఐఎస్ అవసరం లేదని, పాకిస్థానీ తాలిబన్లు ఆ పని సమర్థంగా చేయగలరని అన్నారు. ఏదో ఒకరోజు పాకిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నా తాను ఆశ్చర్యపోను అని ట్విటర్ ద్వారా పంచుకున్నారు.