Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏపీలోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఉన్న శివాలయాన్ని దర్శించుకునేందుకు ముగ్గురు యువకులు వెళ్లారు.
అక్కడ స్నానాలు చేసేందుకు గాను వారు గోదావరి నదిలో దిగారు. కొద్ది క్షణాల్లో నది ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమికంగా గల్లంతైన వారు తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన వారిగా గుర్తించారు.గా దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.