Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్, ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బ్రెండన్ మెక్కల్లమ్ ను అధిగమించి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు రెండు సిక్సర్లు బాది మెక్కల్లమ్ (107) పేరిట ఉన్న రికార్డును బ్రెక్ చేశాడు. ప్రస్తుతం స్టోక్స్ (109) సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉండగా మెక్కల్లమ్ (107), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (100) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇదే తరుణంలో ఈ జాబితాలో టాప్-10లో భారత్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (91) ఒక్కడే ఉన్నాడు.