Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీశైలం
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తెల్లవారుజామున 2గంటల నుంచే ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 7గంటలు, శీఘ్ర దర్శనానికి 4గంటలకుపైగా సమయం పట్టింది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండటం, కనీసం తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో దేవస్థానం అధికారుల తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు సున్నిపెంట వద్ద శివ దీక్ష భక్తులు నిరసనకు దిగారు. హైదరాబాద్, తెలంగాణ ప్రాంతం నుంచి వాహనాల్లో ఉదయం శ్రీశైలం వస్తుండగా పోలీసులు సున్నిపెంట వద్ద అడ్డుకున్నారు. శ్రీశైలంలో పార్కింగ్ సదుపాయం లేదంటూ వాహనాలు నిలిపివేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు భక్తులను శ్రీశైలంలోకి అనుమతించారు.