Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్
తెలంగాణలో శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పోలీసులు పనిచేస్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ అభివృద్ధితో పాటు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై దృష్టి సారించారని తెలిపారు.
పోలీసులకు ఎక్స్ గ్రేషియా పెంచడంతోపాటు దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. ఫిర్యాదులు చేయడానికి, దోషులను కలవడానికి, పోలీస్ స్టేషన్ కు చిన్నారులతో వచ్చే మహిళలు ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ రూమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.