Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి బడ్జెట్ సమావేశాలు జరపనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. అయితే ఈసారి రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలుత రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. మొదటి రోజున గవర్నర్ ప్రసంగం, బీఏసీ సమావేశం ఉంటాయి. రెండో రోజు సంతాప తీర్మానాలు, వాయిదా ప్రకటన ఉంటాయి. ఇక, రెండో విడత సమావేశాలు మార్చి 6న ప్రారంభం అవుతాయి. బడ్జెట్ సమావేశాలు 13 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే, అసెంబ్లీ సమావేశాలు రెండు విడతల్లో జరపనున్నట్టు తెలుస్తోంది.